ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుపై విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయి. గత ఏడాది ప్రభుత్వం తెలంగాణ విశ్వవిద్యాలయంలో 4 కోర్సులతో కూడిన ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. అనతి కాలంలోనే ఇంజనీరింగ్ కళాశాలకు బోధన (54), బోధనేతర (33) పోస్టులు మంజూరు కావడం టీయూ ఉన్నతాధికారుల కృషి ఫలితమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.