అన్నమయ్య: కురబలకోట మండలంలో కొత్తపల్లికి చెందిన పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తి తన భార్య అంజలి (23)పై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. అత్తమామలు వేధిస్తున్నారని భార్య ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన భర్త ఈ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.