AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. మరమ్మతుల దృష్ట్యా ఘాట్ రోడ్డు మూసివేస్తున్నామని తెలిపారు. ఇవాళ్టి నుంచి జూన్ 12 వరకు దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో కనకదుర్గానగర్ వైపు, లిఫ్ట్ మార్గంలో అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు సూచించారు.