VSP: విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహా స్వామి దేవస్థానంలో ఈ నెల 20న జరగనున్న వార్షిక చందనోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ కేటగిరీలలో టికెట్లు పొందిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు.