MDK: వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా 43 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్లు నిర్మించుకోవాలన్నారు.