AP: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు వైద్యులు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేశారు. ఆ చిన్నారి కోసం మంత్రి లోకేష్ విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించారు. ఇంజెక్షన్ చేసిన అనంతరం చిన్నారి పునర్వికను లోకేష్ ముద్దు పెట్టుకున్నారు. 100 ఏళ్లు జీవించు తల్లి అని మంత్రి దీవించారు. మంత్రి లోకేష్, వైద్యులు, ప్రజలకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.