ATP: ఈ నెల 20న CM చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని కాలువ ఫౌండేషన్ చైర్మన్ కాలువ భరత్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ వేడుకకు రాష్ట్ర సాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.