WNP: వనపర్తి మండలం గౌరీదేవిపల్లి గ్రామానికి చెందిన సావిత్రమ్మ పై అదే గ్రామానికి చెందిన బోయ నర్సింహ దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం బాధితురాలిని బూతులు తిట్టి, రాయితో కొట్టి గాయపరిచినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు రేవల్లి ఎస్సై రజిత కేసు నమోదు చేశారు. నిందితుడు నర్సింహ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.