JN: జనగామలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పాడి పశువుల యూనిట్ల సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగించినట్లు ఈడీ మాధవి లత శుక్రవారం తెలిపారు. గతంలో ఏప్రిల్ 16తో ముగిసిన గడువును మరికొంత మందికి అవకాశం కల్పించేందుకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.