PDPL: మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వైకుంఠ రథాలకు రూ.1.80 కోట్లు మంజూరయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. మంథని మండలం అడవి సోమనపల్లి, ఎక్లాస్పూర్, గుంజపడుగు, మైదుపల్లి, ముత్తారం మండలం మచ్చుపేట కేశనపల్లి, పాలకుర్తి మండలం కన్నాల, రామగిరి మండలం సుందిళ్ల, కమాన్పూర్ మండల కేంద్రానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.