VZM: బొబ్బిలి సీఐ కె.నారాయణరావు శుక్రవారం రాత్రి స్దానిక చింతాడలో పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత వాహనదారులు పాటించి ప్రమాదాలు నివారణకు సహకరించాలని, గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని గ్రామస్తులు సూచించారు. చెడు వ్యసనాలతో జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. అనంతరం సైబర్ నేరాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.