PPM: వైసీపీ అధినేత Y. S. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణిను పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యురాలిగా నియమించారు. ఈ సందర్భంగా గురుగుబిల్లి మండల నాయకులు, కార్యకర్తలు ఆమెను అభినందించారు. పార్టీ పట్ల నిబద్ధతను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారని, ఆమె నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.