ASR: ముఖ్యమంత్రి హామీ కింద మంజూరై, పెండింగ్లో ఉన్న పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సొంత భవనాలు లేని పాఠశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న భవనాల లెంటల్, స్లాబ్ లెవల్ పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలన్నారు.