ప్రకాశం: దొనకొండ మండల నూతన ఎస్సైగా రామకృష్ణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో పనిచేసి సాధారణ బదిలీలో భాగంగా దొనకొండ పోలీస్ స్టేషన్కు బదిలీ కావడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై టీ. త్యాగరాజు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళ్లారు. ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ.. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు.