గుంటూరు జిల్లా తాడికొండకు నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. ఉమేష్ సోమవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కను అందజేశారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. గతంలో తెనాలి రూరల్లో సీఐగా పనిచేసిన ఉమేష్, బదిలీలలో భాగంగా ఈ బాధ్యతలు చేపట్టారు.