AP: గిరిజన ప్రాంతాల్లో అమలయ్యే పథకాల పురోగతిపై అధికారులతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్చించారు. ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ స్కూల్స్, హోస్టళ్ల పనితీరుపై సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం, వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపరచాలని, తాగునీరు, రోడ్లు, విద్యుత్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.