NRML: లోకేశ్వరం మండల నూతన తహసీల్దార్‌గా మంతెన సూర్యరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నిర్మల్ కలెక్టరేట్లో AOగా పనిచేసిన ఆయన, ఇటీవల బదిలీల్లో భాగంగా ఇక్కడ నియమితులయ్యారు. మండల ప్రజలకు వేగవంతమైన, పారదర్శక రెవెన్యూ సేవలు అందించడంతో పాటు పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.