ADB: ఇంద్రవెల్లి మండలంలోని శ్యామ్ చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను DRDO పీడీ కుటుంబరావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులను పూర్తి చేయాలని కూలీలకు సూచించారు.