MHBD: తొర్రూరు మండలంలోని నాంచారి మడూరు గ్రామ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే కాలేజీలో రాచర్ల కార్తీక్(19) అనే విద్యార్థి ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి స్వస్థలం భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లిగా గుర్తించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.