LSG ఓనర్ సంజీవ్ గొయెంకా వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా AI, డిజిటల్ మార్ఫింగ్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. అటువంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.