HNK: ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభ, సృజనాత్మకతతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉంటారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య అన్నారు. శనివారం హన్మకొండలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రచార కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తమ విద్యను అందించడంలో ముందుందని వారు పేర్కొన్నారు.