ATP: అనంతపురం మార్కెట్ యార్డ్లో ప్రతి శనివారం రైతులకు నిర్వహిస్తున్న ఉచిత భోజన కార్యక్రమంలో ఛైర్పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో కలిసి భోజనం చేసి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. రైతులు తమ ఆనందాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.