PDPL: ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాగూర్ తెలిపారు. ఈనెల 26న గోదావరిఖని సింగరేణి స్టేడియంలో జరిగే అవంతిక తెలంగాణ ప్రోమో రన్- 2026 కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ సొసైటీ ఆఫ్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ‘ఫిట్ తెలంగాణ’ నినాదంతో 2, 5, 10K రన్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.