MDK: ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గురువారం ఆయన మెదక్‌లోని బీసీ బాలుర వసతి గృహంతో పాటు గిరిజన మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, దుస్తులు, కాస్మెటిక్ ఛార్జీలు, నోట్ పుస్తకాలు సక్రమంగా అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.