VSP: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను వసూళ్లలో అగ్రగామిగా నిలిచి రాష్ట్ర స్థాయి అవార్డును అందుకుంది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ చేతుల మీదుగా అవార్డును కమిషనర్ కేతన్ గార్గ్ స్వీకరించారు. నగర ప్రజల సహకారంతో ఈ గౌరవం దక్కిందని ఆయన తెలిపారు. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.