MHBD: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి కార్మికులు అంటే ఏమిటో కేంద్ర ప్రభుత్వానికి తెలియాలని AITUC జిల్లా గౌరవాధ్యక్షులు ఓమ బిక్షపతి పిలుపునిచ్చారు. డివిజన్ కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక హక్కులను కాలరాసేలా తీసుకువచ్చిన 4 లేబర్ కోడులను రద్దు చేసే విధంగా ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు.