AP: సింగపూర్లో 2వ రోజు మంత్రుల పర్యటన ముగిసింది. ఉదయం సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో మంత్రులు భేటీ అయ్యారు. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై శిక్షణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. సమర్థ నాయకత్వం, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంపై చర్చించారు. అనంతరం సింగపూర్ అభివృద్ధి చెందిన విధానం, భవిష్యత్ ప్రణాళికల గ్యాలరీని మంత్రులు సందర్శించారు.