BHPL: జిల్లా RTC డిపో ముందు RTC కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెకు TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మద్దతు తెలిపారు. కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణలు అమలు చేయడం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్మికుల పోరాటానికి TRP అండగా ఉంటుందన్నారు.