ఈ సీజన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఓటమి లేకుండా దూసుకుపోతోంది. ఈ టోర్నీలో భాగంగా ఈనెల 25న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆ జట్టు తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు కీలక ప్లేయర్ కూపర్ కనోలీ దూరమయ్యే అవకాశం ఉంది. ఫిట్నెస్ పరీక్షల కోసం అతడు ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది పంజాబ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.