ప్రకాశం: పామూరు మండలం వగ్గంపల్లి అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడా-2026 పక్షోత్సవాలను నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.వీ.ఎస్. పార్వతి మాట్లాడుతూ.. గర్భధారణ నుంచి 2 సంవత్సరాల వరకు పిల్లల మెదడు 80% అభివృద్ధి చెందుతుందని, తల్లి తీసుకునే పోషకాహారం తల్లి-బిడ్డ ఆరోగ్యానికి కీలకమని తెలిపారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.