కోనసీమ: అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలానికి చెందిన సాధనాల శ్రీను ఇటీవల జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం వైసీపీ సీనియర్ నాయకులు, గుడ్ సీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుంచే రమణారావు ఆయనను అభినందిస్తూ శాలువాతో సత్కరించి అభినందించారు. రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.