NZB: రోడ్లు భవనాల శాఖ పరిధిలో కొనసాగుతున్న పనుల్లో నాణ్యతతో చేపట్టాలని అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం R&B అధికారులతో సమీక్షించారు. FIDS కింద రూ. 60 కోట్ల నిధులతో చేపట్టిన పనులను త్వరగాతిన పూర్తి చేయాలన్నారు. ఆర్యనగర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి దత్తాత్రేయ మందిరం వరకు రూ. 22 కోట్లతో బిటి రోడ్డు పనులపై సమీక్షించారు.