AP: జనగణన కోసం స్వయంగా వివరాలను నమోదు చేసుకోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను CS సాయిప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఈ బాధ్యతలకు జిల్లా కలెక్టర్లు, పురపాలికల అధికారులతో పాటు ఆయా శాఖలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 5k రన్ నిర్వహించనున్నారు.