GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిన్న కలిశారు. ఈ నెల 26న (ఆదివారం) పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించనున్న వాసవి జయంతి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను ఆర్యవైశ్య సంఘం పట్టణ సభ్యులు అందజేశారు.