ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఈ నెలాఖరులోపు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా మాఫీ చేస్తామని ఈడీ కుముద తెలిపారు. 2015-16 నుంచి 2018-19 ఆర్థిక ఏడాదుల్లో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల కింద అప్పులు పొందిన వారికి ఈ అవకాశం కల్పించారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.