WNP: విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే మెగా రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి మండలం చిట్యాల జ్యోతిరావు పూలే గురుకులంలో నూతన సైన్స్ ల్యాబ్‌ను ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన ప్రారంభించారు. ల్యాబ్ సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.