SRCL: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో తాగునీరు నిత్యం సరఫరా చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేసవికాలం నేపథ్యంలో జిల్లాలో తాగునీరు సరఫరాపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ పబ్లిక్ హెల్త్ అధికారులతో కలెక్టరేటిలో బుధవారం సమావేశం నిర్వహించారు.