కాకినాడ: పెద్దాపురం నవోదయ విద్యాలయ NCC శిబిరంలో బుధవారం క్యాడెట్లకు AI, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. 18 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ మహమ్మద్ అసిఫ్ ఆధ్వర్యంలో ఆదిత్య యూనివర్సిటీలో ఈ శిక్షణ నిర్వహించారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవడం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశమని అసిఫ్ పేర్కొన్నారు.