కరీంనగర్ సుడా పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైస్ ఛైర్మన్ ప్రఫుల్ దేశాయ్ కలిసి ఇంజినీరింగ్ అధికారులతో సుడా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాజీవ్ చౌక్ సుందరీకరణ, వర్టికల్ గార్డెన్ పనులను మే 21 నాటికి పూర్తి చేయాలన్నారు.