NRPT: ధన్వాడ మండలం కిష్టాపూర్లో ఈనెల 25న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొండాపూర్లో సర్పంచ్ గ్రామ పెద్దలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ధార్మిక చైతన్యం, సాంప్రదాయ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.