TG: కాంగ్రెస్, బీజేపీ సిగ్గువిడిచి కాళేశ్వరంపై విషప్రచారం చేశాయని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ‘రేవంత్ కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి కాళేశ్వరం వరప్రదాయినైతే, కాంగ్రెస్ శనేశ్వరం. దానిని BRSకు ATM అంటూ చిల్లర ప్రచారం చేశారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బరాజ్ మాత్రమే కాదు.. 141 టీఎంసీల నీటి లభ్యత’ అని పేర్కొన్నారు.