KRNL: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఎమ్మిగనూరులో అదనపు డ్యూటీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. గురువారం ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, ఐసీడీఎస్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమపై అదనపు పని భారం మోపడం వల్ల మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకురాలు గోవర్ధనమ్మ పేర్కొన్నారు. త్వరలో వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.