SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో రోడ్డు మధ్యలో నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భవనాలపై నుంచి ప్రమాదకరంగా వెళ్తున్న ఈ వైర్లను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి వైర్లను పక్కకు మార్చాలని స్థానికులు కోరారు.