TG: కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావు, ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉంది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరిస్తుంది. కార్మికులు సంయమనం పాటించాలి’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.