MBNR: మహబూబ్ నగర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ జయప్రద తెలిపారు. ఉమ్మడి జిల్లా మహిళా అభ్యర్థులు దోస్త్ (DOST) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.