NTR: నందిగామ మండలం అంబారుపేటలో నిర్మాణంలో ఉన్న నూతన సబ్స్టేషన్ పనులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సబ్స్టేషన్ నిర్మాణ పురోగతి, పనుల నాణ్యత, ఉపయోగిస్తున్న సామగ్రి ప్రమాణాలు, భద్రతా చర్యలు వంటి కీలక అంశాలపై నేరుగా అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.