BHNG: ఉపాధి హామీ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలీ రూ. 800 ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మోటకొండూర్ మండలం ఆరెగూడెంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు.