RR: చేవెళ్ల పట్టణ కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహనీయుల జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ.. ఈనెల 30న చేవెళ్లలో జరిగే మహనీయుల జాతరను కులాలకు మతాలకు అతీతంగా బహుజనులందరూ ఏకమై విజయవంతం చేయాలన్నారు. దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం యువతరం కృషి చేయాలన్నారు.