NLG: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో స్ఫూర్తి సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ ఉచిత మంచినీటి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మట్టి కుండల ద్వారా స్వచ్ఛమైన చల్లని నీటిని అందించే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు.