AKP: నర్సీపట్నంలో నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా వారోత్సవ వేడుకలు సోమవారంతో విజయవంతంగా ముగిసాయి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి ఆధ్వర్యంలో ఫైర్ ఆఫీసు వద్ద అగ్ని ప్రమాదాల మీద అవగాహన కల్పించే స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిలో అనేక రకాల అగ్నిమాపక పరికరాలను ప్రదర్శించారు. వీటిని తిలకించడానికి వచ్చిన విద్యార్థులకు వాటి ఉపయోగాలను వివరించారు.